ప్రజాప్రతినిధుల పిల్లలు ప్రభుత్వ బడిలోనే.. | - | Sakshi
Sakshi News home page

ప్రజాప్రతినిధుల పిల్లలు ప్రభుత్వ బడిలోనే..

Jun 18 2026 12:05 AM | Updated on Jun 18 2026 12:05 AM

సర్పంచ్‌ కుమారుడికి అడ్మిషన్‌ ఇచ్చి పాఠ్యపుస్తకాలు

అందిస్తున్న సర్పంచ్‌, ఉపాధ్యాయులు

కథలాపూర్‌(వేములవాడ): జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం గంభీర్‌పూర్‌ జెడ్పీ హైస్కూల్‌లో స్థానిక సర్పంచ్‌, వార్డు సభ్యుడి పిల్లలు అడ్మిషన్లు బుధవారం తీసుకున్నారు. సర్పంచ్‌ గుంటుక మనోహర్‌ కుమారుడు పృథ్వీరాజ్‌ జెడ్పీ హైస్కూల్‌లో ఏడో తరగతిలో చేరాడు. వార్డుసభ్యుడు ఓలపు కొండగట్టు కూతురు అనుశ్రీ ఆరో తరగతిలో అడ్మిషన్‌ తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్య అందుతుందని చేర్పించినట్లు వారు పేర్కొన్నారు. ఇద్దరు విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చి పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు అందించినట్లు హెచ్‌ఎం సుధాకర్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement