సిరిసిల్లటౌన్: శతాబ్ది చరిత్ర గల సిరిసిల్లలోని ప్రభుత్వ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా సకినాల శ్రీనివాస్ 2018లో బాధ్యతలు స్వీకరించారు. తాను విద్యాభ్యాసం చేసిన పాఠశాలలో అప్పటికి కేవలం 60 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. జిల్లాకు ఎంతోమంది మేధావులను అందించిన తన బడి పరిస్థితికి చలించారు. పూర్వ విద్యార్థులతో ముఖాముఖీ అయ్యారు. దాతల సాయంతో డిజిటల్ బోధన అందేలా కృషి చేశారు. 2020లో కరోనా రావడంతో ఢీలా పడలేదు. తల్లిదండ్రులను చైతన్యపరిచి ఆన్‌లైన్‌లోనే అడ్మిషన్లు చేస్తూ తరగతులు నిర్వహించారు. దీంతో చాలా మంది తల్లిదండ్రుల దృష్టి హైస్కూల్‌పై పడింది. 2024, 2025లో ఏ ఒక్క రోజు సెలవు తీసుకోలేదు. 60 మంది విద్యార్థులు ఉన్న స్కూల్‌లో నేడు 303 మంది చదువుకుంటున్నారు. 2024నుంచి 2026 వరకు వరుసగా పదో తరగతిలో నూరుశాతం ఫలితాలు వస్తున్నాయి. గతేడాది కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు.


