జగిత్యాలరూరల్: తనను ప్రశ్నిస్తున్నవారికి అభివృద్ధి పనులతోనే జవాబు చెబుతామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. బీర్‌పూర్ మండలం తుంగూర్‌లో సముద్రంరోడ్ నుంచి దొంతాపూర్ రోడ్డు వరకు రూ.1.80 కోట్లతో నిర్మించే పనులను ఆదివారం పరిశీలించారు. ప్రజలకు అవసరమైన రవాణా సౌకర్యం కల్పించడంతోపాటు రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు. కొల్వాయి, చిన్న కొల్వాయి రోడ్డాం, సారంగాపూర్ నుంచి బీర్‌పూర్ ఘాట్ రోడ్డు, కమ్మునూర్–మంగెల, వడ్డెరకాలనీ రోడ్డు, బట్టపల్లి రోడ్లకు నిధులు మంజూరయ్యాయన్నారు. సర్పంచ్ రాజగోపాల్‌రావు, నాయకులు రాంచందర్‌రావు, బుచ్చన్న, తిరుపతి, శ్రీనివాస్, రాజమల్లయ్య, లక్ష్మినర్సింహారావు, లక్ష్మిరాజం పాల్గొన్నారు.


