మత్తు పదార్థాల నిర్మూలన అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాల నిర్మూలన అందరి బాధ్యత

Jun 14 2026 7:10 AM | Updated on Jun 14 2026 7:10 AM

● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాల: మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత అని, ఐఎంఏ చేపట్టిన యాంటీ డ్రగ్‌ 3 కే రన్‌ మంచి కార్యక్రమమని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. ఐఎంఏ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో జూన్‌ 26 న నిర్వహించనున్న యాంటీ డ్రగ్‌ 3కే రన్‌ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను లక్ష్యంగా చేసుకుని సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాల వ్యసనం దేశభద్రతకు తీవ్రమైన ముప్పుగా మారిందన్నారు. యువతలో అవగాహన పెంపొందించేందుకు ఐఎంఏ చేస్తున్న సేవలు అమోఘమని చెప్పారు. 3కే రన్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఐఎంఏ కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్‌ రహిత నిర్మాణమే ప్రధాన లక్ష్యమని, యువత మేల్కొని డ్రగ్స్‌ బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆరోగ్యవంతమైన భవిష్యత్‌ కోసం దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో కోశాధికారి సుధీర్‌కుమార్‌, వడ్లూరి శ్రావణ్‌కుమార్‌, విజయ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement