సంఘాలతో మహిళల ఆర్థికాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

సంఘాలతో మహిళల ఆర్థికాభివృద్ధి

Jun 14 2026 7:10 AM | Updated on Jun 14 2026 7:10 AM

మల్లాపూర్‌: గ్రామాల్లో వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేయడమే ధ్యేయమని వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ జువ్వాడి నర్సింగరావు అన్నారు. మండలంలోని గుండంపల్లిలో రూ.10లక్షలతో చేపట్టే సీసీ రోడ్డుకు శనివారం భూమిపూజ చేశారు. సిరిపూర్‌లో మహిళాసంఘానికి రూ.3లక్షల ప్రోసిడింగ్‌ పత్రాలు అందజేశారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సర్పంచ్‌లు దప్పుల పద్మ, పెంట సౌజన్య, కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ఎలాల జలపతిరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అంతడుపుల పుష్పలత, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మాట్ల సోమయ్య, నాయకులు పాల్గొన్నారు. అనంతరం రాఘవపేట, ముత్యంపేట, నడికుడ, గుండంపల్లి, కుస్తాపూర్‌ గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలకు రూ.4.27 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు.

పథకాలను వినియోగించుకోవాలి

మెట్‌పల్లి: ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, అర్హులందరూ విని యోగించుకోవాలని నర్సింగరావు అన్నారు. 47 మందికి మంజూరైన రూ.17.72లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను స్థానిక పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు అందించారు. గంగపుత్ర సంఘం భవనానికి రూ.3లక్షల ప్రొసీడింగ్‌ కాపీ అందించారు. మున్సిపల్‌ చైర్మన్‌ మైలారపు లింబాద్రి, మాజీ జెడ్పీటీసీ ఎలాల జలపతిరెడ్డి, కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షులు రైసుద్దీన్‌ నాయకులు పాల్గొన్నారు.

వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ జువ్వాడి నర్సింగరావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement