రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన చెట్టు
గాలికి ఎగిరిపోయిన ఇంటి పైకప్పు
వెల్గటూర్(ధర్మపురి): మండలంలో శుక్రవారం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం బీభీత్సం సృష్టించింది. ఈదురుగాలులకు గుల్లకోటలో చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. చాలా సేపటి వరకు రాకపోకలకు అంతరా యం ఏర్పడింది. ఇంటి రేకులు లేచి పోయి రోడ్డుపై పడ్డాయి. రాజక్కపల్లిలో రంగు సత్తయ్య ఇంటి పైకప్పు పూర్తిగా ఎగిరిపోయింది. ఇంట్లో ఉన్న సామగ్రి, నిత్యావసర వస్తువులు తడిసి ముద్దయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకున్నారు.


