లోక్‌అదాలత్‌కు న్యాయవాదులు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

లోక్‌అదాలత్‌కు న్యాయవాదులు సహకరించాలి

Jun 12 2026 5:45 AM | Updated on Jun 12 2026 5:45 AM

జగిత్యాలజోన్‌: జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈనెల 20న నిర్వహించే లోక్‌ అదాలత్‌కు న్యాయవాదులు సహకరించాలని జిల్లా జడ్జి సి.రత్నపద్మావతి సూచించారు. జిల్లాకోర్టులోని బార్‌ అసోసియేషన్‌లో గురువారం న్యాయవాదులతో సమావేశమయ్యారు. కక్షిదారులకు లోక్‌ అదాలత్‌ సమాచారం అందించి, కేసులు రాజీ చేసుకునేలా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు కేసులు పరిష్కరిస్తున్నా.. కొత్త కేసులతో కోర్టులపై అధికభారం పడుతోందన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి సునీత, సబ్‌ జడ్జి నాగేశ్వర్‌రావు, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి లావణ్య, మొదటి అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ నిఖిషా, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, న్యాయవాదులు పాల్గొన్నారు.

జిల్లా ప్రధాన న్యాయయమూర్తి సి.రత్న పద్మావతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement