ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

Jun 11 2026 7:41 AM | Updated on Jun 11 2026 7:41 AM

● బడులను బలోపేతం చేస్తాం ● విద్యార్థులకు వసతులు కల్పిస్తున్నాం ● ప్రైమరీ స్కూళ్లలో ఏఐతో కూడిన విద్య ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఈవో రాము ● విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి పాఠశాలలో తాగునీరు, పెయింటింగ్‌, విద్యుత్‌ సౌకర్యం, డిజిటల్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. పిల్లల తల్లిదండ్రులు ఆలోచణ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలి. ఇప్పటికే బడిబాట కార్యక్రమం ప్రారంభించాం. సుమారు రెండు వేలకు పైగా అడ్మిషన్లు చేయించాం. బాలబాలికలకు గుణాత్మకమైన విద్యనందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఈసారి యూనిఫాం క్లాత్‌ రావడంలో జాప్యం జరిగింది. రాగానే మహిళా సంఘాలకు యూనిఫాంలు కుట్టే బాధ్యత అప్పగించి వెంటనే కుట్టేలా చర్యలు చేపడతాం. త్వరితగతిన విద్యార్థులకు పంపిణీ చేస్తాం. విద్యార్థులందరికీ సరిపడా నోట్‌బుక్స్‌, పాఠ్య పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకున్నాం. జిల్లాకు మూడు లక్షల పాఠ్య పుస్తకాలు, 3 లక్షల నోట్‌బుక్కులు పంపిణీ చేశాం. ● బడిబయట ఉన్న పిల్లలను గుర్తిస్తున్నాం. ముఖ్యంగా బాలికలను గుర్తించి వారిని బడిలో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఏ ఒక్క విద్యార్థి కూడా బయట ఉండకుండా చూసుకుంటున్నాం. ప్రతి విద్యార్థి పాఠశాలకు రావా ల్సిందే. ప్రతి పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులున్నారు. గతేడాది సర్దుబాటు చేసి ఇబ్బందులు లేకుండా చూశాం. అదే ప్రస్తుతం కొనసాగు తోంది. ● విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విద్యావాలంటీర్ల నియామకం కోసం ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్పకుండా ఏర్పాటు చేస్తాం. ఎలాగైనా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. పలు పాఠశాలల్లో వంట గదుల కొరత ఉంది. విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం. 100 వంట గదులకు నిధులు మంజూరు చేశారు. త్వరలోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. ● ప్రతి పాఠశాలలో టాయిలెట్స్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవనే విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా 350టాయిలెట్స్‌కు నిధులు మంజూరు చేశారు. త్వరలోనే అన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. ● ఈ ఏడాది జిల్లా పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే నాలుగో స్థానం సాధించింది. ఇది ఉపాధ్యాయుల కృషితోనే సాధ్యమైంది. ఇంకా మెరుగైన ఫలితాల కోసం ప్రయత్నిస్తున్నాం. ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఇచ్చేలా చూస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం జిల్లాను అగ్రగామిగా ఉంచేలా చర్యలు తీసుకుంటాం. ● జిల్లాలో ఇప్పటికే ప్రీప్రైమరీ స్కూళ్లు 51 ఉన్నాయి. ఈసారి వాటిని 69కి పెంచాం. ఇందులో చిన్నారులకు అన్ని వసతులతో కూడిన విద్య అందుతుంది. ప్రైమరీ స్కూళ్లలో ఏఐతో కూడిన విద్య అందించనున్నాం.

పాఠశాలల్లో వసతులపై..

గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం..

విద్యావలంటీర్ల నియామకంపై..

మూత్రశాలలు, మరుగుదొడ్లపై..

మెరుగైన ఫలితాల కోసం..

ప్రీప్రైమరీపై..

జగిత్యాల: ప్రభుత్వ

పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని, కార్పొరేట్‌కు ధీటుగా విద్య అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని డీఈవో రాము తెలిపారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులకు ఇప్పటికే అన్ని రంగాల్లో శిక్షణ ఇచ్చామన్నారు. ఖాళీలు ఉన్న చోట సర్దుబాటు చేశామన్నారు. ఈనెల 15 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో

మాట్లాడారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement