కోరుట్ల/కోరుట్లరూరల్/మల్లాపూర్: పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. బుధశారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఆస్పత్రి అభివృద్ధికి నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు. రోగులకు తాగునీటి కోసం బోర్ మోటార్ బిగించాలన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత, సూపరింటెండెంట్ సునీతారాణి, వైద్యులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఈతచెట్లు కాపాడుకునేందుకు బోర్లకు ఎమ్మెల్యే మంజూరు పత్రాలు అందించారు. ఐలాపూర్‌లో మూడు బోర్లకు రూ.6లక్షలు, మోహన్‌రావుపేటలో రెండు బోర్లకు రూ.4 లక్షలు, యూసుఫ్‌నగర్‌కు ఒక బోరుకు రూ.2 లక్షల మంజూరు పత్రాలను గౌడ సంఘ నాయకులకు అందించారు.
మల్లాపూర్‌లో కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ
మల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. తహసీల్దార్ రాంచందర్, సర్పంచ్‌లు చిట్యాల లక్ష్మణ్, తోట శ్రీనివాస్, గొండ రాజేందర్, ఏలేటి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాఘవపేట, పాతదాంరాజుపల్లి, గొర్రెపల్లిలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆయా కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.


