టెక్స్‌టైల్‌ పార్కులో భారీ అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

టెక్స్‌టైల్‌ పార్కులో భారీ అగ్నిప్రమాదం

Jun 11 2026 7:35 AM | Updated on Jun 11 2026 7:35 AM

రూ.40 లక్షల ఆస్తి నష్టం

తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని టెక్స్‌టైల్‌ పార్కులో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. పార్కులోని శ్రీసిరి టెక్స్‌టైల్స్‌శ్రీ పరిశ్రమలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో యజమాని వాసం రేఖకు చెందిన 7 ర్యాపియర్‌ లూమ్స్‌(మరమగ్గాలు)తోపాటు సుమారు రూ.40 లక్షల విలువైన వస్త్రం కాలి బూడిదైంది. మంటలకు షెడ్‌ కూడా దెబ్బతింది. ఫైర్‌స్టేషన్‌ అధికారులు, తంగళ్లపల్లి పోలీస్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement