ఉదయించే కిరణాలు | - | Sakshi
Sakshi News home page

ఉదయించే కిరణాలు

Jun 11 2026 7:35 AM | Updated on Jun 11 2026 7:35 AM

ఉదయించే కిరణాలు

ఉదయించే కిరణాలు బాలలు

బడికి వెలుగులు బాలలు

చదువుల తల్లి బిడ్డలు

చిరునవ్వుతో చిందులేస్తుండే బాలలు

సంతోషానికి మారుపేరు బాలలు!!

ప్రగతికి బాటలు బాలలు

భరతమాత ముద్దుబిడ్డలు

ఎదుగుతున్న పిల్లలు

భావితరానికి వెలుగు దివ్వెలు!!

బాలలు బంగారు కిరణాలు

అవనిలో వెలిసిన చిరుమొగ్గలు

స్వచ్ఛమైన మనసుకు చిరునామా

బంగారు భవితకు పునాదులు

చిరునవ్వుకు చిరునామా బాలలు!!

దేవులపల్లి రమేశ్‌, కవి, రచయిత

ఎంజేపీ తెలుగు అతిధి ఉపాధ్యాయుడు

గ్రామం : నంగునూర్‌, సిద్దిపేట(జిల్లా)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement