డంపింగ్‌యార్డుపై రాజకీయం వద్దు | - | Sakshi
Sakshi News home page

డంపింగ్‌యార్డుపై రాజకీయం వద్దు

Jun 9 2026 4:42 AM | Updated on Jun 9 2026 4:42 AM

ధర్మపురి: ప్రభుత్వ స్థలంలో డంపింగ్‌యార్డు వద్దంటూ కొందరు రాజకీయం చేస్తున్నారని జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఎస్‌.దినేష్‌ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. మండలంలోని తిమ్మాపూర్‌ – మద్దునూర్‌ గ్రామాల మధ్య సర్వేనంబర్‌ 266లోగల ప్రభుత్వ స్థలాన్ని డంపింగ్‌యార్డు కోసం కేటాయిస్తే కొందరు గ్రామస్తులను రెచ్చగొడుతూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. 2021లోనే అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ స్థలా న్ని కేటాయించిందని గుర్తు చేశారు. డంపింగ్‌యార్డుతో తిమ్మాపూర్‌ గ్రామస్తులకు వచ్చే నష్టమేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిలుముల లక్ష్మణ్‌, వేముల రాజేష్‌, కౌన్సిలర్లు, సర్పంచ్‌ బాలాగౌడ్‌, నాయకులు సుముక్‌ రఫియోద్దిన్‌ తదితరులున్నారు.

ఎంవీ నర్సింహారెడ్డి మృతి

జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఎస్‌కేఎల్‌ఎన్‌రావు బీఈడీ కళాశాల కరస్పాండెంట్‌, ప్రముఖ రచయిత ఎంవీ.నర్సింహారెడ్డి (85) సోమవారం సాయంత్రం అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన మృతిపట్ల పలువురు పట్టణ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement