జగిత్యాలరూరల్: విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. సారంగాపూర్ మండలం పోచంపేట, లక్ష్మీదేవిపల్లిలో రూ.10లక్షలతో నిర్మించే మహిళా సంఘ భవనాలకు ఆదివారం భూమిపూజ చేశారు. గతంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుని మధ్యలో నిలిపివేసినవారికి తిరిగి చేపడితే నిధులు మంజూరు చేస్తామన్నారు. ప్లాస్టిక్ నిషేధం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు శేఖర్, జగదీష్, ఉప సర్పంచ్‌లు ఉపేందర్, సుజాత, ఎంపీడీవో సలీం, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు మల్లారెడ్డి, నర్సింహారెడ్డి, నాయకులు సొల్లు సురేందర్, రమేష్, రాజు, శంకర్ రెడ్డి, భాస్కర్, శ్రీనివాస్, రాజేందర్ రెడ్డి, శేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.
నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు
నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో రూ.20లక్షలతో నిర్మించే గ్రామ పంచాయతీ భవనానికి, రూ.10 లక్షలతో నిర్మించే మహిళాసంఘం భవనానికి భూమిపూజ చేశారు. రూ.235 కోట్లతో కొత్త ఆస్పత్రి నిర్మాణం చేపడతామన్నారు. ఏఎంసీ చైర్మన్ నారాయణ రెడ్డి, సర్పంచ్ నోముల రమ్య, ఉప సర్పంచ్ బాలు, నాయకులు దామోదర్ రావు, రవీందర్ రెడ్డి, ఎంపీడీవో రమాదేవి, తహసీల్దార్ హకీం, డీఈ మిలిన్, ఎంపీవో రవిబాబు, ఏఈ విజయ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సంజయ్‌కుమార్


