భూమి ఎంతున్నా రూ.2లక్షలకు మించి బ్యాంకులు రుణం ఇవ్వడం లేదు. ఎక్కువ కావాలంటే భూమిని మార్టిగేజ్ చేయమంటున్నారు. సక్రమంగా రుణం చెల్లిస్తున్న రైతులకు అధిక మొత్తంలో పంట రుణం ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది. ఆ మేరకు బ్యాంకర్లపై ప్రభుత్వం ఒత్తిడి పెంచాలి. – వేముల విక్రం రెడ్డి, ధర్మపురి(మం)
స్కేల్ ఆఫ్ పైనాన్స్ మేరకే..
వానాకాలం సీజన్‌కు అన్ని బ్యాంకుల్లో పంట రుణాల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటికే కొందరు పాత రుణాలు చెల్లించి.. తిరిగి తీసుకుంటున్నారు. వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు పంట రుణం ఇస్తాం. సక్రమంగా రుణం చెల్లించే వారికి స్కేల్ ఆఫ్ పైనాన్స్ మేరకు ఎక్కువ మొత్తంలో పంట రుణం ఇస్తున్నాం.
– రాంకుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్, జగిత్యాల


