బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య

Jun 7 2026 8:00 AM | Updated on Jun 7 2026 8:00 AM

కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి):మల్లయ్యపల్లెకు చెందిన భీరం లక్ష్మి(80) బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈనెల 4న ఉపాధి పనికి వెళ్లి వచ్చిన చిన్న కుమారుడు లింగారెడ్డి నల్లా నీళ్లు ఎందుకు పట్టలేదని తల్లి లక్ష్మిని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై ఈనెల 5న ఊరి చివర వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కాగా, తన తల్లి లక్ష్మి మృతిపై తమకు ఎలాంటి అనుమానం లేదని పెద్దకుమారుడు సమ్మిరెడ్డి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్‌ తెలిపారు.

మహిళపై కార్యదర్శి లైంగిక వేధింపులు

హుజూరాబాద్‌ రూరల్‌: మహిళపై పంచాయతీ కార్యదర్శి లైగింక వేధింపులకు పాల్పడిన ఘటన మండలంలోని చెల్పూర్‌లో కలకలం రేపింది. బాధిత మహిళ తెలిపిన వివరాలు కార్యదర్శి జయేందర్‌ దళితబంధు రెండో విడత నిధులు మంజూరు చేయిస్తానని రూ.10,000 తీసుకున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడంటూ గ్రామానికి చెందిన ఓ మహిళ హుజూరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేసింది. కేసు విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement