కాంగ్రెస్‌ ‘చేతి’కే కోఆప్షన్‌ | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ‘చేతి’కే కోఆప్షన్‌

Apr 25 2026 7:24 AM | Updated on Apr 25 2026 7:24 AM

జగిత్యాల మున్సిపల్‌లో నలుగురి ఎన్నిక మెట్‌పల్లిలో సమావేశానికి దూరంగా బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ముగ్గురు బీజేపీ సభ్యుల హాజరుతో కలిసివచ్చిన కోరం ఎట్టకేలకు పదవులు దక్కడంతో ఊపిరి పీల్చుకున్న అధికార పార్టీ

జగిత్యాల/మెట్‌పల్లి(కోరుట్ల): జగిత్యాల, మెట్‌పల్లి మున్సిపల్‌ కోఆప్షన్‌ పదవులు కాంగ్రెస్‌ ప్రతిపాదించిన అభ్యర్థులనే వరించాయి. జగిత్యాల బల్దియాలో శుక్రవారం చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి అధ్యక్షతన కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పదవుల కోసం 11 మంది దరఖాస్తు చేసుకోగా పోటీ లేకుండానే ఎన్నిక జరిగింది. ఇటీవల ఎమ్మెల్యే, మంత్రి సూచించిన కో ఆప్షన్‌సభ్యుల విషయంలో కొంత వివాదం చోటుచేసుకున్నా ఎమ్మెల్యే ప్రతిపాదించిన ముగ్గురికి, మంత్రి సూచించిన ఒకరికి పదవి వచ్చింది. జనరల్‌ విభాగంలో గట్టు సతీశ్‌, వీరబత్తిని పద్మజ, మైనార్టీ కోటాలో తస్లీమ్‌ సుల్తానా, అబ్దుల్‌ ఖదీర్‌ (ముజ్జు) ఎన్నికయ్యారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కమిషనర్‌ స్పందన ఆధ్వర్యంలో సభ్యులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

తస్లీమ్‌సుల్తానా

పద్మజ

మహ్మద్‌అబ్దుల్‌ఖదీర్‌

Advertisement
 
Advertisement
Advertisement