మెట్‌పల్లి బల్దియాలో నాలుగు పదవుల్లో మూడు ‘చేతి’కే చిక్కగా, ప్రత్యేక ప్రావీణ్యం కోటా కింద బ రిలో నిలిచిన రిటైర్డ్ ఉద్యోగి సీహెచ్.రవీందర్‌కు సాఽ దారణ మెజార్టీ రాక అతడిని ఎన్నుకోలేదు. మున్సి పల్ సమావేశ మందిరంలో శుక్రవారం చైర్మన్ మై లారపు లింబాద్రి అధ్యక్షతన కోఆప్షన్ సభ్యులను ఎ న్నుకున్నారు. మైనార్టీ కోటా కింద పన్నాల మాధవరెడ్డి, షాద్మనాజ్, మాజీ ప్రజాప్రతినిధుల కోటా కింద గజం లక్ష్మిని సభ్యుల వాయిస్ ఓటు పద్ధతిలో వ చ్చిన మెజార్టీని పరిగణనలోకి తీసుకొని ఎన్నికై నట్లు కమిషనర్ స్పందన ప్రకటించారు. మిగిలిన ప్రత్యేక ప్రావీణ్యం కోటాలో రవీందర్‌కు అవసరమైన మె జార్టీ రాక అతన్ని ఎన్నుకోలేదని ఆమె తెలిపారు.
బీజేపీ సభ్యుల హాజరుతోనే కోరం
కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. సమావేశానికి మొదట ఆరుగురు కాంగ్రెస్, నలుగురు స్వతంత్రులతో పాటు బీజేపీ కౌన్సిలర్ బొడ్ల రమేశ్, బీజేపీ నుంచి సస్పెండ్ అయిన చెట్లపల్లి మీనా హాజరయ్యారు. బీఆర్‌ఎస్ సభ్యులు, బీజేపీకి చెందిన కొంత మంది సభ్యులు గైర్హాజరయ్యారు. అయితే అప్పటి వరకు కోరంకు అనుగుణంగా సభ్యుల సంఖ్య లేక ఎన్నిక విషయంలో కొంత సందిగ్ధం ఏర్పడింది. అంతలోనే బీజేపీ కౌన్సిలర్లు అరిగెల అనూష, అరిసె వనజ రావడంతో అధికారులు ఎన్నిక ప్రక్రియ పూర్తి చేశారు.
బీఆర్‌ఎస్ మాజీ కౌన్సిలర్‌కు మద్దతు
మాజీ ప్రజాప్రతినిధుల కోటా కింద మహిళా సభ్యురాలి ఎన్నిక విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ పదవికి కాంగ్రెస్ నుంచి మాజీ కౌన్సిలర్ పిప్పెర లత దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆమెకు ఆ పార్టీ కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలిసింది. దీంతో గత్యంతరం లేక ఆ పార్టీ పెద్దలు బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ కౌన్సిలర్ గజం లక్ష్మిని కాంగ్రెస్‌లో చేరడానికి ఒప్పించి ఎన్నికల్లో గెలిపించారని సమాచారం.
హాజరైన బీజేపీ సభ్యులపై పార్టీలో ఆగ్రహం
కోఆప్షన్ సమావేశానికి హాజరైన ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లపై ఆ పార్టీకి చెందిన మిగతా కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముగ్గురు హాజరు కాకుంటే కోరం లేక ఎన్నిక జరిగే అవకాశముండేది కాదు. దీంతో వీరు ఎన్నిక జరగడానికి పరోక్షంగా దోహదపడ్డారని ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. చైర్మ న్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన బీజేపీ కౌన్సిలర్ మీనాపై అదే రోజు పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ప్రస్తుతం ఈ ముగ్గురిపైనా కూడా చ ర్యలు తీసుకుంటామని జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు తెలిపారు.
మాధవరెడ్డి
గజం లక్ష్మి


