బలహీనవర్గాలకు ద్రోహం చేసిన రేవంత్‌, పొన్నం | - | Sakshi
Sakshi News home page

బలహీనవర్గాలకు ద్రోహం చేసిన రేవంత్‌, పొన్నం

Apr 25 2026 7:24 AM | Updated on Apr 25 2026 7:24 AM

రాయికల్‌(జగిత్యాల): రాష్ట్రంలోని బలహీనవర్గాలకు ద్రోహం చేసింది సీఎం రేవంత్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ అని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం రాయికల్‌లో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్‌ సమగ్ర కుటుంబ సర్వేలో మైనార్టీలను మినహాయించి 51 శాతం మంది ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్‌ 46 శాతం మందే బలహీనవర్గాలే ఉన్నారని ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. 5 శాతం బలహీనవర్గాల ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ము న్సిపల్‌ చైర్మన్‌ కట్కం రవీందర్‌, జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ హరిచరణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement