కొడిమ్యాల : మండలంలో గతనెల రోజులుగా అడవిలో తిరుగుతూ పశువులపై దాడి చేసిన పులి సోమవారం రాత్రి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి ఆవును చంపిన పులికొంత భాగం తిని వదిలేసింది. మిగిలిన మాంసం కోసం మళ్లీ వచ్చే అవకాశం ఉన్నందున అటవీ శాఖ అధికారులు ఆ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. సోమవారం అర్ధరాత్రి తిరిగి మరోసారి ఆవు మాంసాన్ని తింది. పులి వయసు నాలుగున్నరేళ్లు ఉంటుందని తెలిపారు. పులిని ట్రాక్ చేసేందకు మూడు బృందాలను నియమించామని, పశువుల కాపరులు, రైతులు జాగ్రత్తగా ఉండాలని జిల్లా అటవీశాఖ అధికారి రవి ప్రసాద్ తెలిపారు. పులి ఆకలి తీర్చుకునేందుకు మరోసారి చనిపోయిన ఆవు వద్దకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎఫ్‌ఆర్‌ఓ గులాం మొయినద్దీన్, డీఎఫ్‌ఆర్వో ముషీర్, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు, అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు.


