నృసింహాలయంలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

నృసింహాలయంలో భక్తుల రద్దీ

Mar 22 2026 5:28 AM | Updated on Mar 22 2026 5:28 AM

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివార్లను దర్శించుకున్నారు.

ప్లాస్టిక్‌పై మహిళల పోస్ట్‌కార్డు ఉద్యమం

జగిత్యాలజోన్‌: ప్లాస్టిక్‌ను నిషేధించాలంటూ జిల్లాకేంద్రంలోని గణేశ్‌నగర్‌ మహిళా కిట్టిపార్టీ సభ్యులు శనివారం పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. క్యాన్సర్‌ నుంచి బయటపడిన న్యాయవాది నాగిరెడ్డి మధుసూదన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ను నిషేధించాలంటూ మహిళలు పోస్ట్‌కార్డు ద్వారా ప్రభుత్వ పెద్దలకు తెలిపారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్‌ వాడటం ద్వారా కలిగే అనర్థాల గురించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అయిత అనిత వివరించారు. ప్లాస్టిక్‌ను ఇళ్లలో వాడబోమంటూ మహిళలు ప్రతిజ్ఞ చేశారు.

బడ్జెట్లో విద్యారంగానికి అరకొర నిధులు

జగిత్యాలటౌన్‌: బడ్జెట్లో విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక తహసీల్‌ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్‌ వర్కింగ్‌ కమిటీ మెంబర్‌ మల్యాల రాకేశ్‌ మాట్లాడుతూ బడ్జెట్‌ కేవలం అంకెల గారడీ మాత్రమేనన్నారు. విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రూ.3,24,234కోట్ల బడ్జెట్‌లో విద్యారంగానికి రూ.26,734 కోట్లు కేటాయించడం సిగ్గు చేటన్నారు. అలవి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగానే విద్యారంగానికి తీరని అన్యాయం చేసిందని పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో వసతులు, బోధన, బోధనేతర సిబ్బంది లేక ఉన్నత విద్యను వదిలేసే పరిస్థితి నెలకొందన్నారు. జిల్లా కన్వీనర్‌ మాడవేని సునీల్‌, నగర కార్యదర్శి రాపాక నిఖిల్‌, రాహుల్‌, కిరణ్‌, విశాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement