కోరుట్ల: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీలోకి వస్తే సంతోషంగా ఆహ్వానిస్తామని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జీవన్ రెడ్డి నిరాడంబరమైన వ్యక్తి అని, అవినీతి మచ్చలేని నాయకుడని ప్రశంసించారు. అలాంటి వ్యక్తి తమ పార్టీలోకి వస్తే తాను స్వయంగా భుజాలపై ఎత్తుకుని మోసుకొస్తానని వ్యాఖ్యనించారు. ఎమ్మెల్యే అంటే గన్‌మెన్‌లతో ఆడంబరాలు చేస్తారని, కొందరు ఎమ్మెల్యేగా గెలవకున్నా పార్టీ ఇన్‌చార్జులుగా గన్‌మెన్లను కోరుకుంటూ ఆడంబరాలు చేస్తారని, జీవన్‌రెడ్డి వంటి వారు ఏ ప దవిలో ఉన్నా.. సింపుల్‌గా ఉంటారని తెలిపారు. అందుకే జీవన్‌రెడ్డి అంటే తనకు ఎనలేని గౌరవమని అన్నారు.
అన్ని వర్గాలను మోసం చేసిన బడ్జెట్..
రాష్ట్ర బడ్జెట్ అన్నివర్గాలను మోసం చేసేలా ఉందని ఎమ్మెల్యే విమర్శించారు. ఇందిరమ్మ బీమాలో కొత్తదనం ఏమీ లేదని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతులు, నేత, గీత, ఆటో రిక్షా కార్మికులందరికీ బీమా కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. దానినే కాంగ్రెస్ పేరు మార్చింది తప్ప కొత్తగా చేసిందేమీ లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను అటకెక్కించారని పేర్కొన్నారు. కేసీఆర్ న్యూట్రీషన్ కిట్టుతో తల్లీబిడ్డలు ఆరోగ్యవంతంగా ఉన్నారని, దానిని రాష్ట్ర ప్రభుత్వం తన గొప్పగా చెప్పుకుంటోందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో విద్యార్థులకు అల్పాహారం అందిస్తే.. రెండున్నరేళ్లు నిలిపివేసి ఇప్పు డు పేరుమార్చి ప్రారంభించడం సిగ్గుచేటన్నా రు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.


