ఎస్సారెస్పీ నిర్మాణ సమయంలో విలువైన భూములను ప్రభుత్వానికి ఇచ్చాం. చల్‌గల్‌లో ఉద్యాన పరిశోధన కేంద్రం లేదా కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలి. పండ్ల తోటలతోపాటు పసుపు పంట ఎక్కువగా ఉన్నందున పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది.
– బందెల మల్లయ్య, చల్‌గల్
పండ్ల తోటలకు నేలలు అనుకూలం
అన్ని రకాల పండ్ల తోటలకు ఇక్కడి నేలలు అనుకూలం. అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉత్తర తెలంగాణలో పెద్ద మామిడి మార్కెట్ ఉంది. కాబట్టి ఉద్యాన పరిశోధన కేంద్రం లేదంటే కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తే రైతులకు మరింతగా మేలు జరిగే అవకాశం ఉంది.
– కోల నారాయణ, చల్‌గల్


