దళిత, గిరిజన, అట్టడుగు వర్గాల సాధికారతను కేంద్రబిందువుగా చేసుకుని సీఎం రేవంత్, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రూపొందించిన 2026–27 బడ్జెట్ సమగ్రాభివృద్ధికి మార్గదర్శిగా నిలుస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ప్రతిపాదించి న సామాజిక న్యాయం, సమాన అవకాశాల లక్ష్యాలను ప్రతిబింబించే బడ్జెట్.
– మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్ సంచలన స్కీంను ప్రారంభించింది. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువత సాధికారత, ఆర్థిక క్రమశిక్షణల మధ్య సమతుల్యం దిశగా ప్రజా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది.
– సత్తు మల్లేశ్, కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్
అల్పాహారం పథకం పేద,మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు వరం. మఽ ద్యాహ్న భోజన పథకానికి ఇది తోడవడంతో డ్రాపౌ ట్స్ మరింత తగ్గుతాయి. ఈ పథకాన్ని ఇంటర్ విద్యార్థులకూ వర్తింపజేయడం సాహసోపేతమైన నిర్ణయం. విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేసిన సీఎంకు కృతజ్ఞతలు. – డాక్టర్ సూరేపల్లి
సుజాత, విద్యా కమిషన్ సభ్యురాలు


