జగిత్యాలటౌన్: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కార్మిక వర్గాన్ని మరోసారి నిరాశకు గురిచేసింది. గత బడ్జెట్ కన్నా రూ.20వేల కోట్లు పెంచినా ఇందులో రాష్ట్ర ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి కేటాయింపులు లేకపోవడం శోచనీయం. సమగ్ర బీమా పథ కం పేరుతో ఉద్యోగులు, పెన్షనర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. మహిళా, శిశు సంక్షేమం కోసం రూ.3,143 కోట్లు కేటాయించినా అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పారితోషికం పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లక్షలాది కార్మికుల ఆశలు, వారి ఆకాంక్షలను నెరవేర్చకపోగా ప్రజలపై మరింత భారం మోపారు. – కోమటి చంద్రశేఖర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి
గల్ఫ్ కార్మికులకు మరోసారి మోసం
రాయికల్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గల్ఫ్ కార్మికులను మరోసారి మోసం చేసింది. ఎన్నికలకు ముందు కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ప్యాకేజీ కేటాయించి, గల్ఫ్ పాలసీ ప్రకటిస్తామని మేనిఫెస్టో ప్రకటించి విస్మరించారు. గల్ఫ్‌లో ఉంటున్న 15 లక్షల మంది కార్మికులకు ఎలాంటి రక్షణ లేకుండా పోయింది. – రాధారపు సతీశ్,
బహ్రెయిన్ ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్ సెల్ అధ్యక్షుడు


