కార్మికులకు వేతనాలు చెల్లించాలని అధికారులకు ఇప్పటికే సూచించాం. బుధవారం వరకు పెండింగ్ వేతనాలు చెల్లిస్తారు. ఈవిషయంపై అధికారులతో ఇప్పటికే చర్చలు జరిపాం. మరోసారి వారితో సమావేశమై సమీక్షిస్తాం. ఆస్తిపన్ను వసూలుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాం.
– మహంకాళి స్వామి, మేయర్, రామగుండం
రెండురోజుల్లో చెల్లింపులు
కార్మికులందరికీ రెండురోజుల్లోగా వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆస్తిపన్ను 100 శాతం వసూలయ్యేలా ప్రతీరోజు సమీక్షిస్తున్నాం. ప్రాపర్టీ ట్యాక్స్, నల్లాబిల్లులు, ట్రేడ్‌లైసెన్స్ వసూళ్లపై ప్రతీరోజూ ప్రత్యేకంగా సమీక్షిస్తూనే ఉన్నాం.
– అరుణశ్రీ, కమిషనర్, రామగుండం


