జగిత్యాల: విద్యార్థులకు అంతర్జాతీయ విషయాలపై అవగాహన పెంపొందించాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో విద్యార్థులకు అంతర్జాతీయ అంశాలపై అవగాహన పెంపొందించేందుకు విద్యాశాఖ జిల్లా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో నమూనా ఐక్యరాజ్య కార్యక్రమం నిర్వహించారు. వనరులపై ఆధిపత్యం కోసమే అనేక యుద్ధాలు జరిగాయని, ప్రస్తుతం కూడా చమురుపై ఆధిపత్యంపై యుద్ధాలు జరుగుతున్నాయన్నారు. ఇతరులపై ఆధారపడకుండా ప్రతీ గ్రామం స్వయం సమృద్ధి సాధించేలా విద్యార్థులందరూ కృషి చేయాలని అన్నారు. అదపు కలెక్టర్ రాజాగౌడ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధ వాతావరణంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. డీఈవో రాము మాట్లాడు తూ.. తక్కువ సమయంలో విద్యార్థులను సిద్ధం చేసి పిల్లలకు మంచి మార్గదర్శనం చేసిన ఉపాధ్యాయులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. 50 మంది విద్యార్థులు వివిధ పాఠశాలల నుంచి పాల్గొని దేశాల ప్రతినిధులుగా ప్రసంగించారు. సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ చంద్రశేఖ ర్‌రెడ్డి, సత్యనారాయణ, నీరజ, మహేశ్, రవి, రా మస్వామి, బోనగిరి దేవయ్య, మహేశ్ పాల్గొన్నారు.
భూసర్వేకు సహకరించాలి
రాయికల్: భూసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూభారతి భూసర్వే కార్యక్రమంలో భాగంగా దావన్‌పల్లిలో చేపడుతున్న రీసర్వేకు గ్రామస్తులు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. దావన్‌పల్లి గ్రామంలో రీసర్వే కార్యక్రమంపై గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈనెల 23 నుంచి రీసర్వే కార్యక్రమం ప్రారంభిస్తున్నామని, ముందుగా గ్రామ సరిహద్దులు ఏర్పాటు చేయడంతోపాటు ప్రభుత్వ భూమి, పట్టాదారు భూమి వంటి భూసమస్యలపై రీసర్వే చేపడతామన్నారు. ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ నాగార్జున, సర్పంచ్ ప్రసాద్, ఏడీ సర్వే కిషన్‌ప్రసాద్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ విఠల్‌రావు, ఆర్‌ఐ పద్మయ్య, సర్వేయర్ నరేందర్ పాల్గొన్నారు.


