ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలి

Mar 18 2026 11:13 AM | Updated on Mar 18 2026 11:13 AM

కోరుట్ల రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అబివృద్ధి, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లాపరిషత్‌ సీఈవో గౌతమ్‌రెడ్డి అన్నారు. కోరుట్ల మండల పరిషత్‌ కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. ఫైళ్లు పెండింగ్‌లో ఉండకూడదని సూచించారు. ఎంపీడీవో ఓదెల రామకృష్ణ, కోట చ క్రాధర్‌, సుచరిత్‌, రాజశేఖర్‌, మమత పాల్గొన్నారు.

జీతం పెరిగినా.. హోదా మారదు

జగిత్యాల: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంపన్న శ్రేణి వర్తించదని సీనియర్‌ సిటిజన్స్‌ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో మాట్లాడారు. ఉద్యోగుల్లో సంపన్నశ్రేణి రిజర్వేషన్ల వర్తింపుపై జీతం పెరిగినా హోదా పెరగదని, ఆదాయం ఒక్కటే సంపన్న శ్రేణికి కొలమానం కాదని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చిన నేపథ్యంలో నాన్‌ క్రిమిలేయర్‌ సర్టిఫికెట్ల జారీ, సంపన్న శ్రేణిపై అవగాహన ఉండాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు క్రిమిలేయర్‌ వర్తించదని అన్నారు. గ్రూప్‌–3, గ్రూప్‌–4 స్థాయిలో మొదటి ఉద్యోగం పొంది పదోన్నతి ద్వారా వార్షిక ఆదాయం రూ.8లక్షలు దాటిన వారు క్రిమిలేయర్‌ కిందకు రారని, వారి పిల్లలు ఓబీసీలుగా పరిగణించబడతారన్నారు. గ్రూప్‌–1, గ్రూప్‌–2 స్థాయి ఉద్యోగాల్లో నియామకమైన వారి పిల్లలు మాత్రమే సంపన్న శ్రేణిలోకి వస్తారని అన్నారు. రిటైర్డ్‌ తహసీల్దార్‌ హన్మంతరెడ్డి, విశ్వనాథం, విజయ్‌, అశోక్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement