ఈ బంగ్లాను చూస్తుంటే ఏదో శుభకార్యానికి అందంగా ముస్తాబు చేసినట్లు కనిపిస్తుంది కదూ. ఎంతో ఆకర్షణీయంగా ఎగబాకిన రాధాకృష్ణ పూల తీగ భవంతి మెడలో అలంకరించిన గజమాలను తలపిస్తోంది. జగిత్యాల పట్టణంలోని రాజీవ్ బైపాస్ రోడ్డులోని సాజిద్ అలీ ఇంటిపైకి ఎగబాకిన రాధాకృష్ణ చెట్టు తీగకు విరబూసిన పూలతో ఆ భవంతి.. ప్రకృతి అందాలు హారంగా అలంకరించినట్లు కనిపిస్తోంది. రోడ్డుపై వెళ్లే వాహనదారులు, పాదచారులు ఆసక్తిగా చూస్తున్నారు. ఆ ఇంటి యజమాని మహ్మద్ సాజిద్ అలీ ఆఫ్రికన్ ప్యారెట్ జాతి చిలుకను పెంచుతున్నాడు. చిలుక తింటూ కింద పడేసిన సన్‌ఫ్లవర్ గింజ మొలకెత్తి సన్‌ఫ్లవర్ పూవు విరబూసింది. దీంతో ఇంటి ఆవరణ మరింత సుందరంగా కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది.
– జగిత్యాలటౌన్


