రారండోయ్.. వేడుక చూద్దాం
పీహెచ్‌డీ పట్టాలు అందుకోనున్న విద్యార్థులు
అట్టహాసంగా నిర్వహిస్తాం
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ 2వ స్నాతకోత్సవాలకు ముస్తాబవుతుంది. ఈ నెల 7న వేడుకలు యూనివర్సిటీలోని క్రీడా ప్రాంగణంలో జరుగనున్నాయి. ఇప్పటికే ప్రాంగణాన్ని ముస్తాబు చేసే పనిలో పడ్డారు వర్సిటీ అధికారులు. ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ హాజరుకానున్నారు. ఆయనతో పాటు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బీజే రావు రానున్నారు.
● మమ్మురంగా ఏర్పాట్లు.
2వ స్నాతకోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హాజరయ్యే వారు ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకునేలా, వారితో పాటు మరొకరికి ఎంట్రీ పాసులు అందజేయనున్నారు. ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు అభ్యర్థులు తమ ఐడీ కార్డును సమర్పించి పాస్‌లు తీసుకోవాలని వర్సిటీ అధికారులు తెలిపారు. 7న ఉదయం 9.30 గంటలలోపు స్నాతకోత్సవ ప్రాంగణంలో తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలని పేర్కొన్నారు.
● 161 బంగారు పతకాలు.. 25 పీహెచ్‌డీ పట్టాలు
శాతవాహన 2వ స్నాతకోత్సవం సందర్భంగా మొత్తం 129 మంది విద్యార్థులు 161 బంగారు పతకాలు (పలువురు విద్యార్థులు రెండు పతకాలు సాధించారు) గవర్నర్ చేతుల మీదుగా అందుకోనున్నారు. అలాగే వివిధ అంశాల్లో పరిశోధనలు చేసిన 25 మంది పీహెచ్‌డీ పట్టాలు స్వీకరిస్తారు. శాతవాహన యూనివర్సిటీ ఆరంభం నాటి నుంచి పీహెచ్‌డీ చేసిన వారికి పట్టాలు అందించనున్నారు. యూనివర్సిటీ తొలిసారిగా డాక్టరేట్‌ను కామర్స్ విభాగంలో అంకం శ్రీనివాస్‌కు అందజేసింది.
● 3వ స్నాతకోత్సవానికి ఇప్పటినుంచే....
ఆగస్టులో వీసీ ఉమేశ్‌కుమార్ అమెరికా పర్యటన సందర్భంగా భవిష్యత్‌లో జరిగే 3వ స్నాతకోత్సవ వేడుకలకు నిధులు సేకరించడం విశేషం. అమెరికాలో తెలంగాణ మేధావులను కలిసి విశ్వవిద్యాలయాన్ని బలోపేతం చేయడానికి నిధులు, మౌలిక సదుపాయాలను సమకూర్చారు. శాతవాహన ట్రస్ట్ ఏర్పాటుతో పాటు 8 నుంచి 10 బంగారు పతకాలను కొత్తగా 3వ స్నాతకోత్సవానికి సిద్ధం చేసినట్లు వీసీ వివరించారు.
సోషల్ సైన్స్ విభాగంలో కె.రాజేంద్రం, ఫాతిమాసుల్తానాబేగం, వి.జమున, ఎం.తిరుపతి, (ఎకనామిక్స్), బి.ఆదినారాయణ, ఎం.శ్రీనివాస్, బి.వాసవి (సోషియాలజీ)
ఆర్ట్స్ విభాగంలో సైద ఫాతిమున్నీస్సా అస్మా, ఎండీ అబ్దుస్ సలాంకౌసర్, నాజీయా ఫాతిమా, అస్రా తస్నీమ్ (ఉర్దూ).
బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగంలో కె.వైష్ణవి, ఇ.రమేశ్, వి.సృజన దేవి, కె.జైపాల్.
కామర్స్ విభాగంలో ఎ.శ్రీనివాస్, కె.స్వాతి, బి.శ్రీనివాస్.
సైన్స్ విభాగంలో ఎన్.మల్లారెడ్డి, జి.శ్రీనివాస్, డి.రఘు, ఎం.ప్రవీణ్‌కుమార్, కె.సదానందం, ఎస్.మానస, టి.మంజుల (కెమిస్ట్రీ).
7న శాతవాహన స్నాతకోత్సవ సంబురం
ముస్తాబవుతున్న యూనివర్సిటీ
వేడుకలకు హాజరుకానున్న గవర్నర్
శాతవాహన 2వ స్నాతకోత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఏర్పాట్లు చివరిదశకు చేరుకున్నాయి. న్యాక్ సాధించే దిశగా యూనివర్సిటీ అడుగులు వేస్తుంది. అందుకు మేం కృషి చేస్తున్నాం.
– ఉమేశ్‌కుమార్, వైస్ చాన్స్‌లర్
రారండోయ్.. వేడుక చూద్దాం


