
శ్మశాన వాటిక వివాదం పరిష్కరించండి
రాయికల్‌లోని ఎర్రకుంట వద్ద గల సర్వే నంబర్ 740లోని 15గుంటల భూమిని మా పూర్వీకుల నుంచి రెవెన్యూ రికార్డుల్లో గోసంగి కుల సంఘం పేరిట నమోదై ఉంది. అక్కడ శ్మశానవాటికగా ఉపయోగిస్తున్నాం. ఆ భూమికి ఓ వ్యక్తి తప్పుడు ధ్రువీకరణపత్రాలతో తనదంటూ రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశాడు. మోఖాపై విచారించిన అధికారులు కూడా ఆ భూమి మాదేనని తేల్చారు. కానీ.. సదరు వ్యక్తి ఆ స్థలం తనదేనంటూ బెదిరిస్తున్నాడు. ఆ భూమిని భూభారతి ఆన్‌లైన్‌లో నమోదు చేయించి శాశ్వత పరిష్కారం చూపండి. – గోసంగి కులస్తులు, రాయికల్