
బాల నేరస్తుల కేసులకు సత్వర పరిష్కారం
జగిత్యాలజోన్: జువైనల్ జస్టిస్ బోర్డు ఏర్పాటుతో బాల నేరస్తుల కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా జడ్జి సి.రత్నపద్మావతి అన్నారు. జిల్లాకేంద్రంలోని బైపాస్ రోడ్డులో జువైనల్ జస్టిస్ బోర్డును బుధవారం ప్రారంభించారు. బాల నేరస్థుల కేసుల్లో జరిమానా, శిక్ష విధించడం కాకుండా.. మంచి ప్రవర్తనతో సమాజంలోకి వెళ్లేలా చూస్తామని, సమాజంలో మంచి పరిణామాలపై కౌన్సెలింగ్ ఇస్తామని తెలిపారు. శిశు సంక్షేమ శాఖ ద్వారా వారికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. బోర్డు చైర్‌పర్సన్, జిల్లా మొదటి అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనిజ కోహిర్కర్ బెంచ్ నిర్వహించారు. బాల నేరస్తుల కేసుల్లో బెయిల్‌పై న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. మొదటి అదనపు జిల్లా జడ్జి సుగళి నారాయణ, సబ్ జడ్జి వెంకటమల్లిక్ సుబ్రహ్మాణ్య శర్మ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గంప కరుణాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, కోర్టు సూపరింటెండెంట్ షపీయోద్దిన్, ఎంప్లాయీస్ అధ్యక్షుడు రామడుగు శ్రీనివాస్, మహిళా, శిశు సంక్షేమాధికారి నరేశ్ పాల్గొన్నారు.