
పెద్దాస్పత్రిలో గర్భిణుల అవస్థలు
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంక్షేమ కేంద్రానికి వందలాదిగా గర్భిణులు తరలివస్తుంటా రు. నెలలో సుమారు 300 నుంచి 400ప్రసవాలు ఇక్కడ జరుగుతాయి. జిల్లాకేంద్రం కావడంతో మెరుగైన వైద్యం అందుతుందన్న ఉద్దేశంతో చుట్టుపక్కల గ్రామాలు, పొరుగు జిల్లాల నుంచి కూడా ఇక్కడకే వస్తుంటారు. కొద్దిరోజులుగా స్కానింగ్ కోసం వస్తున్న గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఓ రేడియాలజిస్ట్‌ను బదిలీ చేయ డం.. ఒక్కరే రేడియాలజిస్ట్ ఉండడంతో స్కానింగ్ కోసం గర్భిణులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రతిరోజూ వందమందికి తగ్గకుండా గర్భిణులు వస్తుంటారు. వారంతా స్కా నింగ్ కోసం నిరీక్షించాల్సి వస్తోంది. వాస్తవానికి గర్భిణులకు విశ్రాంతి చాలా అవసరం. బస్సులు, ఆటోలో, ఇతరత్రా వాహనాల్లో వచ్చిన వారు స్కానింగ్ కోసం ఆస్పత్రిలో గంటలకొద్ది వేచి చూడాల్సి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఉదయం వస్తే సాయంత్రం వరకూ ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రేడియాలజిస్ట్‌ను నియమిస్తే సమస్య కొంత తీరే అవకాశం కనిపిస్తోంది. స్టాఫ్‌ను కూడా సరిపడా నియమించాలని అంటున్నారు.
రేడియాలజిస్ట్ ఒక్కరే..
ఆస్పత్రిలో రేడియాలజిస్ట్ ఒక్కరే ఉండటంతో స్కా నింగ్‌కు ఇబ్బందిగా మారింది. ఒక గర్భిణీకి స్కాన్ చేయాలంటే గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది. వంద మందికి పైగా వస్తే ఒకరోజు సరిపోదు. కొంతమంది అక్కడ ఉండలేక వెనుదిరగాల్సి వస్తోంది. జిల్లాకేంద్రానికి చెందిన వారు ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఉంటున్నారు.
ఆస్పత్రిలో జెల్ కరువు
స్కానింగ్‌కు ఉపయోగించే జెల్ కూడా ఆస్పత్రిలో లేదని సమాచారం. ఫలితంగా నాలుగు రోజులుగా స్కానింగ్‌లు నిలిపివేశారు. స్కానింగ్ చేసేటప్పుడు ఎక్కువగా జెల్ ఉపయోగించాల్సి ఉంటుంది. దీంతో గర్భిణులు ఆవేదనకు గురవుతున్నారు. గర్భిణులపై అక్కడ పనిచేస్తున్న సెక్యురిటీ గార్డులు కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని రేడియాలజిస్ట్‌ను నియమించాలని, జెల్ తెప్పించి స్కానింగ్‌లు చేయించేలా చర్యలు చేపట్టాలని గర్భిణులు కోరుతున్నారు.