
జెల్ లేదంటున్నారు
శుక్రవారం నుంచి ఆస్పత్రికి స్కానింగ్ కోసం వస్తున్నాం. వచ్చిన ప్రతిసారీ జెల్ లేదని చెబుతున్నారు. స్కానింగ్ చేయడం లేదు. గంటలకొద్ది కూర్చుండబెడుతున్నారు. దూర ప్రాంతం నుంచి వచ్చాం. పట్టించుకునే వారు లేరు. అధికారులు చర్యలు తీసుకోవాలి.
– గర్భిణి బంధువు
ఇబ్బంది లేకుండా చూస్తున్నాం
జెల్ తెప్పించాం. సిబ్బంది తక్కువగా ఉండటంతో కొంత ఇబ్బందిగా ఉంది. రేడియాలజిస్ట్‌ను త్వరలో నియమిస్తాం. గర్భిణుల కోసం మెరుగైన వసతులు కల్పిస్తున్నాం. రెండుమూడు రోజులుగా సిబ్బంది లేకపోవడం.. జెల్ సరిపడా లేక ఇబ్బంది అయింది.
– రాధాకృష్ణమూర్తి, సూపరింటెండెంట్

జెల్ లేదంటున్నారు