
పేరుకే ప్రజాపాలన
● ఇందిరమ్మ రాజ్యంలో కార్మికులకు ఒరిగిందేమీ లేదు ● సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్
గొల్లపల్లి: కాంగ్రెస్ ప్రజాపాలనలో కార్మికులకు ఒరిగిందేమీ లేదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ అన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా నాలుగో మహాసభను మండలకేంద్రంలోని రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్‌లో యూనియన్ జిల్లా అధ్యక్షులు కోమటి చంద్రశేఖర్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు నిత్యం పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వీధి లైట్లు, డంపింగ్ యార్డ్స్, హరితహారం, వైకుంఠధామాలు, పల్లె పకృతి వనాల నిర్వహణలో పనిచేస్తున్నారని, అలాంటి కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలన్నారు. అనంతరం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా పులి మల్లేశం, అధ్యక్షుడుగా కొమటి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా జంగిలి ఎల్లయ్య, కోశాధికారిగా నేరళ్ల మెహన్, ఉపాధ్యక్షులుగా న్వాతరి మల్లవ్వ, గుడిసె దేవయ్య, శాతల్ల రాజేందర్ ఎన్నికయ్యారు. మహాసభలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు వెల్మలపల్లి వెంకట చారి, నాయకులు కనికరపూ సత్తయ్య, సిరివెల్లి సాయి, జోగవ్వ, లక్ష్మీ నారాయణ, తిరుపతి పాల్గొన్నారు.