
సీపీఆర్‌పై అవగాహన తప్పనిసరి
జగిత్యాల: సీపీఆర్‌పై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. జగిత్యాల బస్టాండ్‌లో ప్రయాణికులకు సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. సీపీఆర్ ఎలా చేయాలి..? కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు ఎలా కాపాడాలని తెలుసుకుంటే ఒకరి ప్రాణాలు కాపాడవచ్చన్నారు. డిపో మేనేజర్ కల్పన, ఎంఎఫ్ కవిత, శ్రీనివాస్, రవీందర్ పాల్గొన్నారు.
స్కానింగ్ సెంటర్లపై నిఘా పెంచాలి
జిల్లాలోని స్కానింగ్ సెంటర్లపై నిఘా పెంచాలని, నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో అన్నారు. అడ్వైజరీ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. స్కానింగ్ సెంటర్ రిజిస్ట్రేషన్ నిబంధనలు పాటించాలని సూచించారు. జిల్లాలో 80 స్కానింగ్ సెంటర్లున్నాయని, లింగ వివక్ష చూపరాదని పేర్కొన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్, అర్చన, స్వ చ్ఛంద సంస్థ సభ్యులు తౌటు రాంచంద్రం, హెల్త్ ఎడ్యుకేటర్స్ భూమేశ్వర్, కరుణ పాల్గొన్నారు.