డివైడర్ల మధ్య మొక్కల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

డివైడర్ల మధ్య మొక్కల తొలగింపు

Oct 15 2025 6:00 AM | Updated on Oct 15 2025 6:06 AM

● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఇదేనా చి(చె)త్తశుద్ధి

జగిత్యాల: జిల్లా కేంద్రంలో జంక్షన్‌లతోపాటు, డివైడర్లలో పిచ్చిమొక్కలు ఏపుగా మారి కళావిహీనంగా మారడంతో ‘పట్టణం కళావిహీనం’ శీర్షికన ఈనెల 14న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో మున్సిపల్‌ అధికారులు స్పందించారు. జగిత్యాల నుంచి కరీంనగర్‌, నిజామాబాద్‌కు వెళ్లే రహదారి డివైడర్ల మధ్య ఏపుగా పెరిగిన కానోకార్పస్‌ మొక్కలను తొలగించారు. దీంతో పట్టణ ప్రజలు, స్థానికులు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు.

విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి

జగిత్యాల: బెస్ట్‌ అవైలబుల్‌ పథకం కింద ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌తో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. విద్యార్థుల ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. కలెక్టర్‌, వి ద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పాఠశాలల యజమాన్యాలతో చర్చించి విద్యార్థుల కు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. చ ర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఎస్సీ వెల్ఫేర్‌ అధికారి రాజ్‌కుమార్‌, కిశోర్‌ పాల్గొన్నారు.

మెట్‌పల్లి: పారిశుధ్యం విషయంలో మెట్‌పల్లి బల్దియా అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడింది. వారి పనితీరుకు ఈ చిత్రాలే నిదర్శనంగా నిలుస్తాయి. 12వార్డులోగల ఓ వీధిలో ఉన్న డ్రైనేజీలు వ్యర్థాలతో నిండిపోయాయి. నెలల తరబడి పూడికతీయకపోవడంతో ఇదిగో ఇలా నిండి దుర్గంధం వెదజల్లుతోంది. సమస్య పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్‌ బాకీ కార్డుల పంపిణీ

గొల్లపల్లి: బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ పిలుపుమేరకు ఆ పార్టీ నాయకులు మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్‌ బాకీ కార్డులు పంపిణీ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు గోస్కుల జలేందర్‌ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు మరిచి ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

డివైడర్ల మధ్య మొక్కల తొలగింపు1
1/6

డివైడర్ల మధ్య మొక్కల తొలగింపు

డివైడర్ల మధ్య మొక్కల తొలగింపు2
2/6

డివైడర్ల మధ్య మొక్కల తొలగింపు

డివైడర్ల మధ్య మొక్కల తొలగింపు3
3/6

డివైడర్ల మధ్య మొక్కల తొలగింపు

డివైడర్ల మధ్య మొక్కల తొలగింపు4
4/6

డివైడర్ల మధ్య మొక్కల తొలగింపు

డివైడర్ల మధ్య మొక్కల తొలగింపు5
5/6

డివైడర్ల మధ్య మొక్కల తొలగింపు

డివైడర్ల మధ్య మొక్కల తొలగింపు6
6/6

డివైడర్ల మధ్య మొక్కల తొలగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement