
పనులు నాణ్యతతో చేపట్టాలి
● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల: పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులు నాణ్యతగా ఉండాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మున్సిపల్ అధికారులతో మంగళవారం సమీక్షించారు. టీయూఎఫ్‌ఐడీసీ జనరల్ ఫండ్‌తో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీ పనులు వర్షాలతో నిలిచిపోయాయని, వెంటనే రంభించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్, డీఈ ఆనంద్, ఏఈలు వరుణ్, చరణ్ పాల్గొన్నారు.
రాయికల్: మండలంలోని కుమ్మరిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కడకుంట్ల అభయ్‌రాజ్ రాష్ట్రస్థాయి సెమినార్ పోటీలకు ఎంపికై నట్లు ఎంఈవో రాఘవులు తెలిపారు. ఈనెల 17న హైదరాబాద్‌లో నిర్వహించే సెమినార్‌లో ఆయన పాల్గొననున్నారు. విద్యార్థుల్లో ఉత్తమ ప్రవర్తన, మార్పులు పెంపొందించడం అనే అంశంపై ఒత్తిడి నుంచి విజయం వైపు, సమస్యల నుంచి పరిష్కారంవైపు అభయ్‌రాజ్ రూపొందించిన పరిశోధనపత్రాలు ఈ సెమినార్‌లో ప్రదర్శించనున్నారు. అభయ్‌రాజ్‌ను డీఈవో రాము, సెక్టోరియల్ అధికారులు సత్యనారాయణ, రాజేశ్, మహేశ్, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పొన్నం రమేశ్, కుంబాల శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి, మండల అధ్యక్షుడు గంగరాజం, ప్రధాన కార్యదర్శి రాపర్తి నర్సయ్యలు అభినందించారు.
ఇబ్రహీంపట్నం: విద్యార్థినులు చదువుతోపాటు కుట్టు శిక్షణ నేర్చుకోవాలని డీఈవో రాము అన్నారు. మండలంలోని వర్షకొండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఓకేషనల్ కోర్సుల్లో భాగంగా టైలరింగ్, ఎంబ్రాయిడరీ నేర్చుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఐదు కుట్టు మిషన్లు అందించింది. వాటిపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు శిక్షకురాలిని నియమించామని డీఈవో తెలిపారు. పది పరీక్షలకు పకడ్బందీగా సన్నద్ధం కావాలని పదో తరగతి విద్యార్థులకు సూచించారు. జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి రాజేశ్, ఎంఈవో మధు, ప్రధానోపాధ్యాయులు రాజేందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జగిత్యాల: సోషల్ మీడియా, సెల్‌ఫోన్లకు విద్యార్థులు దూరంగా ఉండాలని, బాలికలు సంస్కారంతో కూడిన చదువు నేర్చుకోవడం ద్వారా ఉన్నత విలువలు వస్తాయని, తద్వారా ఉన్నతస్థానాలు చేరవచ్చని జిల్లా సంక్షేమాధికారి బోనగిరి నరేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని భవానినగర్‌లో గల గురుకుల పాఠశాలలో మహిళ సాధికారత అంశంపై అవగాహన కల్పించారు. మంచిని గ్రహించి క్రమశిక్షణతో చదువు నేర్చుకోవాలని అన్నారు. సైకాలజిస్ట్ గౌతమ్ మాట్లాడుతూ, విద్యార్థులు ఒత్తిడికి లోను కావద్దన్నారు. అనంతరం విద్యార్థుల కోసం వ్యాసరచన పోటీలు నిర్వహించగా ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో సీడీపీవో మమత, ప్రిన్సిపాల్ సునీత, వైస్ ప్రిన్సిపాల్ జల, విజయలక్ష్మీ, శ్రీనివాస్, పవిత్ర, రాజశ్రీ, అశ్విని, స్వప్న పాల్గొన్నారు.
కోరుట్ల: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కంప్యూటర్ లిటరసిపై అవహన కలిగేలా ఉపాధ్యాయులు శిక్షణ ఇవ్వాలని డీఈవో రాము అన్నారు. పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఫిజిక్స్ ఉపాధ్యాయుల డిజిటల్ లిటరిసీపై మూడు రోజుల శిక్షణ శిబిరాన్ని మంగళవారం సందర్శించారు. విద్యార్థులు కోడింగ్, ఆర్టీఫిషియల్ ఇంటలెజెన్స్‌పై పట్టు సాధించేలా ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు.

పనులు నాణ్యతతో చేపట్టాలి

పనులు నాణ్యతతో చేపట్టాలి

పనులు నాణ్యతతో చేపట్టాలి