
నా వాటా భూమి ఇప్పించండి
నా పేరు కోటె లాస్య. మాది కోరుట్ల మండలం మోహన్‌రావుపేట. భూ తగాదాలతో మా మామ, మరిది, మరో ఆరుగురు కలిసి నా భర్త కోటె రాజేశ్‌ను ఏడాది క్రితం హత్యచేశారు. అడ్డుకునేందుకు వెళ్లిన నాపైనా దాడి చేశారు. నా చేయి విరిగిపోయింది. అప్పటినుంచి నా భర్తకు రావాల్సిన భూమి వాటాను మరిది రాకేశ్ ఆక్రమించి ఇవ్వకుండా బెదిరిస్తున్నాడు. భర్త మరణంతో నేను నా ఇద్దరు పిల్లలు దిక్కులేని వాళ్లమయ్యాం. సమభాగం ఇవ్వాల్సిన ఇంట్లోకి రానీయడం లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నం. పిల్లల పోషణ, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నా భర్తకు రావాల్సిన వాటా భూమి ఇప్పించి న్యాయం చేయండి.