
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
జగిత్యాల/జగిత్యాలటౌన్/జగిత్యాలక్రైం:యోగాతో సంపూర్త ఆరోగ్యం సాధ్యమని కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని
వివేకానంద మినీస్టేడియంలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఎస్పీ యోగాసనాలు వేశారు. మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి నారాయణ, ఆర్డీవో పులి మధుసూదన్‌గౌడ్, డీవైఎస్ఓ రవికుమార్, అడిషనల్ ఎస్పీ భీంరావు, డీఎస్పీలు రఘుచందర్, రాములు, సీఐలు, ఆర్ఎస్సైలు, ఎస్సైలు పాల్గొన్నారు. ముందుగా కలెక్టర్ యోగా గురూజీ రాంరెడ్డిని సన్మానించారు.