బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

అభినందిస్తున్న ప్రిన్సిపాల్‌ ఆనందం - Sakshi

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి స న్నిధిలో మార్చి 3 – 15వ తేదీవరకు జరిగే స్వా మివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభించారు. ఈవో శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రాజగోపురాలకు రంగులు వేస్తున్నారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు నిర్మిస్తున్నారు. తాగునీరు, నీడ వసతుల కల్పనలో నిమగ్నమయ్యారు. వెదురు తడకలతో చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు.

మహిళలు దుస్తులు మార్చుకోవడానికై డ్రెస్‌ ఛేంజింగ్‌ రూంలతోపాటు డ్రెస్సింగ్‌ రూంల వివరాలు భక్తులకు తెలిసేలా కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాలో వాల్‌ పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పు ల ఈశ్వర్‌ ఆదేశాల మేరకు ఆలయ రాజగోపురాలు, ఆలయాలకు విద్యుత్‌ దీపాలు అలంకరిస్తున్నారు. స్వామివారి కల్యాణ వేదిక వద్ద ప్ర త్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రసాదాల కోసం ఒక లక్ష లడ్డూలు, 25 క్వింటాళ్ల పులిహోర ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
మెట్‌పల్లి(కోరుట్ల): పట్టణంలోని వెంకట్రావ్‌పే ట మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకు ల పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు శనివారం హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో బి.శ్రీహిత, డి.హన్సిక, వి.స్పందన, బి.నిమ్నిత ప్రతిభ చూపడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. శుక్రవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో వీరిని ప్రిన్సిపాల్‌ కోటగిరి ఆనందంతోపాటు అధ్యాపకులు అభినందించారు.

వెంకన్నకు క్షీరాభిషేకం
ధర్మపురి : శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం క్షీరాభిషే కం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి వారిని రంగురంగుల పూలతో చూడముచ్చటగా అలంకరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసచార్యుల మంత్రోచ్ఛవాలతో ప్రత్యేకపూజలు జరిపారు. ఆలయ ప్రాంగణంలో లక్ష్మీహవన కార్యక్రమం నిర్వహించారు.

ఆస్పత్రి సందర్శన
రాయికల్‌(జగిత్యాల): స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ని రాష్ట్ర కుస్ఠు నివారణ బృందంలోని సభ్యులు వెంకటేశ్వరాచారి, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహారెడ్డి, హిర్యానాయక్‌ శుక్రవారం సందర్శించారు. వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం అందించే సాయం తదితర అంశాలపై వివరించారు. మెడికల్‌ ఆఫీసర్‌ సతీశ్‌కుమార్‌, ఎంపీహెచ్‌ఎస్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు.

పనులను వేగవంతంగా చేయాలి
జగిత్యాల: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం పూర్తిచేయాలని కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా ఆదేశించారు. అధికారులతో శుక్రవారం ఆమె జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు. జిల్లాలో చేపట్టిన తెలంగాణ క్రీడా ప్రాంగణాల పనులు, వైకుంఠధామాలు, గ్రామపంచాయతీ భవనాల పనులను సకాలంలో పూర్తిచేయాలని సూచించారు. మన ఊరు.. మన బడి పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మకరంద్‌, లత, ఆర్డీవోలు మాధురి, వినోద్‌కుమార్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
 

Read latest Jagtial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top