ఇలాంటి వింత కోరికను ఎప్పుడైనా విన్నారా!

World War II Veteran Wants To Get Buried In Juicy Fruit Gum - Sakshi

న్యూయార్క్‌ : చనిపోయేముందు చివరి కోరికలు ఏమైనా ఉంటే వాటిని తీర్చమని పెద్దలు చెప్తుంటారు. కానీ కొంతమంది చివరికోరికలు వింటే మాత్రం ఇవేం కోరికలురా బాబు ..అని అనుకుంటాం. అలాగే మనిషి చనిపోయిన తర్వాత తన అంత్యక్రియలు వారికిష్టమైన స్థలంలో జరగాలని.. అక్కడే సమాధి కూడా కట్టాలని కోరుతుంటారు. కానీ అమెరికాకు చెందిన 94 ఏళ్ల సుట్టి ఎకానమీ ఒక వింత కోరికను కోరాడు. తాను చనిపోయిన తర్వాత ఒక చూయింగ్‌ గమ్‌ కంపెనీకి చెందిన పేరును బాక్స్‌పై ఏర్పాటు చేసి అందులోనే తనను ఖననం చేయాలంటూ తెలిపాడు. మొదట అతని కోరిక వింతగా అనిపించినా.. కుటుంబసభ్యులు అతని కోరికను తీర్చేందుకు ప్రయత్నించారు. (చదవండి : రాకాసి దోమల గుంపు: జంతువులు మటాష్‌!)

అసలు విషయానికి వెళ్తే.. సుట్టి ఎకానమీ రెండో ప్రపంచయుద్దంలో పాల్గొన్నాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఉన్న ఆయన .. రిగ్లీ జ్యూసీ ఫ్రూట్ కంపెనీ పేరుతో బాక్స్‌ ఏర్పాటు చేసి ఖననం చేయాలని కోరాడు. ఈ విషయాన్ని అతని కుటుంబసభ్యులు.. ఈ విషయాన్ని సదరు కంపెనీకి తెలపగా, వారు తమ లోగోను బాక్స్‌పై వేసేందుకు ఒప్పుకోలేదు.

దీంతో శామ్యూల్‌ ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశాడు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు భారీగా స్పందన లభించింది. సుట్టి ఎకానమీ ఆఖరి కోరిక తీర్చాలని చాలామంది నెటిజన్లు రిగ్లీ కంపెనీని అభ్యర్థించారు. చివరకు ఆ కంపెనీ వృద్ధుడి ఆఖరి కోరిక తీర్చేందుకు అంగీకరించింది. వృద్ధుడి ఇంటికి కంపెనీ నుంచి 250 ప్యాక్ గమ్ కూడా పంపించింది.(చదవండి : స్కేటింగ్‌‌ అదరగొట్టిన కుక్క పిల్ల)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top