
World Court Orders Russia To Stop War: ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ కోర్టు సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఆపాలంటూ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే మిలటరీ ఆపరేషన్‌ను నిలిపివేసి, భద్రతా బలగాలను వెనక్కు తీసుకోవాలని ఐసీజే ఆదేశించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఐసీజే ఆదేశాలను రష్యా తప్పక పాటించాల్సి ఉంటుంది. కాగా, అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హర్షం వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానంలో తామే గెలిచామని పేర్కొన్నారు.
చదవండి: మా కలలను కల్లోలం చేశారు: జెలెన్ స్కీ ఆవేదన