‘జాహ్నవి’ మృతిపై అనుచిత వ్యాఖ్యలు..విధుల నుంచి అధికారి తొలగింపు

US Police Officer Daniel Auderer Removed from Patrol Duties - Sakshi

సియాటెల్‌: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి(23)పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలున్న పోలీసు అధికారిపై వేటు పడింది. పోలీస్‌ అధికారి డేనియల్‌ ఆడెరర్‌ను గస్తీ విధుల నుంచి తొలగించినట్లు సియాటెల్‌ పోలీస్‌ విభాగం గురువారం ధ్రువీకరించింది. అతడికి ఎలాంటి బాధ్యతలను అప్పగించలేదని కూడా తెలిపింది.

అయితే, అడెరర్‌పై చర్యలు ఎప్పుడు తీసుకున్నదీ వెల్లడించలేదు. జనవరి 23వ తేదీన సియాటెల్‌లో కెవిన్‌ డేవ్‌ పోలీసు అధికారి నడుపుతున్న వాహనం ఢీకొని రోడ్డు దాటుతున్న కందుల జాహ్నవి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న మరో అధికారి డేనియల్‌ అడెరర్‌ చులకన చేస్తూ మాట్లాడటంపై తీవ్ర దుమారం చెలరేగింది. అడెరర్‌ బారీ కెమెరా రికార్డింగ్‌ ఆధారంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు సియాటెల్‌ పోలీస్‌ విభాగం పేర్కొంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top