టాయిలెట్‌కి వెళ్లలేని అరుదైన సమస్య! పగవాడికూడా వద్దంటూ విలపిస్తున్న మహిళ

UK Woman Unable To Urinate For Over Year Diagnosed With Rare Syndrome - Sakshi

ఎన్నో జబ్బులు గురించి ఇంతవరకు విన్నాం. అవన్నీ అత్యంత ప్రమాదకరమైనవి. పైగా అవి ఏదో విటమిన్‌లోపం లేదా జన్యు సమస్యల కారణంగా వచ్చిన జబ్బులు. ఇంకాస్త ముందుకెళ్లితే మన పనితీరు కారణంగా వచ్చే విచిత్రమైన వ్యాధులు గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకునే ఈ వ్యాధి అత్యంత అరుదైనది, విని ఉండే ఆస్కారమే లేదు కూడా. ఎందుకంటే అది మనిషి జీవితంలో రొటిన్‌గా చేసే సాధారణ పనిని చేయలేకపోవడం. చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే అరుదైన వ్యాధి బారిన పడింది 30 ఏళ్ల మహిళ. ఈ వ్యాధి పగవాడికి కూడా వద్దంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. 

అసలేం జరిగిందంటే..యూకేకి చెందిన 30 ఏళ్ల మహిళ మూత్ర విసర్జన చేయలేకపోడం అనే వింత సమస్యతో బాధపడుతుంది. ఆ మహిళ పేరు ఎల్లే ఆడమ్స్‌. ఆమె అక్టోబర్‌ 2022లో తాను టాయిలెట్‌కి వెళ్లలేకపోతున్నట్లు తొలిసారిగా గుర్తించింది. ఆమె ఆరోగ్యంగానే ఉంది. ఎలాంటి సమస్యలు లేవు. కానీ ఆమె ఆరోజంతా టాయిలెట్‌కి వెళ్లలేకపోయింది. మనిషి నిత్య జీవితంలో సర్వసాధరణంగా చేసే పనిని చేయలేకపోతున్నానంటూ భోరున విలపించింది. దీంతో ఆమె వైద్యలును సంప్రదించగా..వారు అత్యవసర క్యాథెటర్‌ను అందించారు.

అంటే ఒక ఒక గొట్టాన్ని మూత్రాశయంలోకి పంపి యూరిన్‌ని తీయడం. దీంతో ఆమె మూత్రశయం నుంచి లీటర్‌ యూరిన్‌ తీశారు వైద్యులు. ఇది సాధారణంగా రోగికి శస్త్ర చికిత్సలు చేసేటప్పుడే ఉపయోగిస్తారు. అయితే ఎల్లేకు ఎలాంటి ఆపరేషన్‌ లేకుండానే యూరిన్‌ని ఇలా తీయాల్సి వస్తోంది. ఆ గొట్టాన్ని తీసేసి బాత్రూంకి వెళ్లి ప్రయత్నించినా లాభం లేకుండాపోయింది. చివరికి ఎన్ని మందులు వాడిని ఎలాంటి ప్రయోజనం కనిపించ లేదు. దీని గురించి యూరాలజీ సెంటర్‌ల చుట్టు తిరుగుతూనే ఉంది.

సరిగ్గా 14 నెలలు తర్వాత వైద్యులు నిర్వహించిన పలు టెస్ట్‌ల ద్వారా ఎల్లే ఫౌలర్స్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు నిర్థారించారు. దీంతో ఆమె ఇక జీవితాంతం మూత్ర విసర్జన చేయడానికి క్యాథెటర్‌ అవసరం అని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించి ఎలాంటి చికిత్సలు అందుబాటులో లేవని తెలిపారు. ఫౌలర్స్‌ అనేది యూరిన్‌ని పాస్‌ చేయలేని సమస్య. ఇది ఎక్కువగా యువతులలోనే కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల తాను ఎంతగా ఇబ్బందిపడుతోందో కన్నీరుమున్నీగు చెబుతోంది ఎల్లే.

(చదవండి: మోదీ ఇంటి పేరుపై నాడు ఖుష్బు చేసిన ట్వీట్‌ దుమారం!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top