మోదీ ఇంటి పేరుపై నాడు ఖుష్బు చేసిన ట్వీట్‌ దుమారం!

BJP Leader Khushbu Sundars Old Tweet Viral On Modi Surname - Sakshi

2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మోదీ పేరుపై చేసిన వ్యాఖ్యలకు గాను ప్రధాని మోదీ సొంతం రాష్ట్రంలో రాహుల్‌పై పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో రాహుల్‌ని దోషిగా తేల్చుతూ సూరత్‌ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌ శుక్రవారం పార్లమెంట్‌ సభ్యత్వం కోల్పోయి అనర్హత వేటుకు గురయ్యారు కూడా. ఇది దేశ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారడమే గాక విపక్షాలన్నీ మూకుమ్మడిగా దీన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ సమయంలో నాడు బీజేపీ సభ్యురాలు, నటి ఖుష్బు మోదీ ఇంటి పేరుపై చేసిన ట్వీట్‌ తెరపైకి వచ్చింది.

ఆ ట్వీట్‌లో ఖుష్బు సుందర్‌ మోదీ ఇంటి పేరు గురించి మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పైగా మోదీ ప్రతిచోటా ఉన్నాడని, మోదీ ఇంటిపేరుతోనే అవినీతి ముడి పడి ఉందని.. రాహుల్‌ మాదిరిగానే నాడు ట్విట్టర్‌ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు ఖుష్బు సుందర్‌ కాంగ్రెస్‌ సభ్యురాలిగా ఉన్న సమయంలో చేసిన ట్వీట్‌ ఇది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ మద్దతుదారులు రాహుల్‌పై కేసు పెట్టిన గుజరాత్‌ మంత్రి పూర్ణేష్‌ మోదీని ఇప్పుడూ ఖుష్బు సుందర్‌పై కూడా కేసు వేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. పైగా  ఆమె చేసిన ‍ట్వీట్‌ల స్కీన్‌షాట్‌ను జోడించి మరీ ట్విట్టర్‌ వేదికగా ఆయన్ను నిలదీస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు.

కాగా, ఖుష్బు సుందర్‌ 2020లో కాంగ్రెస్‌ని వీడి బీజేపీలో చేరారు, ప్రస్తుతం ఆమె జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు. దీనిపై ఖుష్బు స్పందిస్తూ.."కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పుడూ చేసిన పోస్ట్‌ ఇది. అందుకు సిగ్గుపడటం లేదు. అప్పుడూ తాను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి తన నాయకుడి అనుసరించి చేసిన పోస్ట్‌ అంటూ సమర్థించుకునే యత్నం చేసింది." ఖుష్బు సుందర్‌. 

(చదవండి: మీ ఛాతీపై బీజేపీ బ్యాడ్జి పెట్టుకోండి అంటూ విలేకరిపై రాహుల్‌ ఫైర్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top