మీ ఛాతీపై బీజేపీ బ్యాడ్జి పెట్టుకోండి అంటూ విలేకరిపై రాహుల్‌ ఫైర్‌

Rahul Gandhi Lost Temper At Media Person Put BJP Badge On Your Chest - Sakshi

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అనర్హత వేటు తర్వాత శనివారం తొలిసారిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ప్రసంగిస్తూ రాహుల్‌ విలేకరిపై నిగ్రహం కోల్పోయారు. ఈ మేరకు రాహుల్‌ మీడియా ప్రసంగంలో..ఒక జర్నలిస్ట్‌ రాహుల్‌ 2019లో లోక్‌సభ ఎన్నికల్లో చేసిన దొంగలందరికీ మోదీ పేరే ఎందుకు ఉంటుంది అనే వ్యాఖ్య గురించి నేరుగా ప్రశ్నించాడు సదరు విలేకరి. దీంతో రాహుల్‌ ఒక్కసారిగా ఆ విలేకరిపై విరుచుకుపడ్డారు. మీరు నన్ను ఈ ప్రశ్నను పరోక్షంగా అడగాలి ఇలా కాదంటూ మండిపడ్డారు.

"మీరు బీజేపీ కోసం పనిచేయాలనుకుంటే మీ ఛాతీపై బ్యాడ్జి పెట్టుకుంటే బావుండేది. అప్పుడూ నేను అందుకు తగ్గట్టుగా సమాధానం ఇస్తాను.  నేను భారతదేశ ప్రజల ప్రజాస్వామ్య వాణిని కాపాడుతూనే ఉంటానని,  ఎవ్వరికీ భయపడేది లేదు. గౌతమ్‌ అదానీ షెల్‌ కంపెనీలకు రూ. 20 వేల కోట్లు ఎవరకీ వెళ్లాయి అనే సాధరణ ప్రశ్న కారణంగా ప్రధాని మోదీ తనను తాను రక్షించే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న దాడులు ఇవి. అయినా నేను ఈ అనర్హతలు, జైలు శిక్ష వంటి వాటికి భయపడను.

నేను మోదీ కళ్లల్లో భయం చూశాను. అదానీపై నా తదుపరి ప్రసంగానిక ప్రధాని భయపడుతున్నారు." అందువల్లే ఈ అనర్హత వేటు అని రాహుల్‌ తేల్చి చెప్పారు. దీనికి ప్రతిస్పందనగా బీజేపీ మోదీ ఇంటిపేరుపై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలతో వెనుకబడిన ఓబీసీ కమ్యూనిటీలను అవమానించారంటూ పునురుద్ఘాటించారు. అయినా ఆయన ఒక్కరే కాదు బీజేపీకి చెందిన ఆరుగురి తోసహా దేశవ్యాప్తంగా 32 మంది నేతలపై అనర్హత వేటు పడిందని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ అన్నారు. అంతేగాదు కర్ణాటక ఎన్నికల ప్రయోజనం కోసం కాంగ్రెస్‌ రాహుల్‌ని ఏదో బలిపశువుగా చేసినట్లుగా యత్నిస్తోందంటూ విమర్శించారు. 

(చదవండి: రాహుల్‌ గాంధీ అనర్హత వేటుపై ఘాటుగా స్పందించిన శరద్‌ పవార్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top