వీడియో: ఐ హేట్ దిస్.. అందరి ముందే చార్లెస్‌ చికాకు.. రాజుగారి తీరే ఇక అంతేనా?

UK King Charles Annoyed Over Leaky Pen Video Viral - Sakshi

డబ్లిన్‌: బ్రిటన్ రాజు చార్లెస్-3 మరోసారి తన చికాకును ప్రదర్శించారు. తన తల్లి, క్వీన్‌ ఎలిజబెత్‌-2 మరణాంతరం ఆయన ఇలా ప్రవర్తిస్తూ మీడియాకు చిక్కడం ఇది రెండోసారి. మంగళవారం ఉత్తర ఐర్లాండ్‌కు వెళ్లిన ఆయన.. అక్కడ విజిటర్స్‌ బుక్‌లో సంతకం చేసే టైంలో పెన్ను లీకైందన్న అసహనాన్ని తీవ్రంగా ప్రదర్శించారు.

తన తల్లి క్వీన్ ఎలిజబెత్ కోసం సంతాపాన్ని తెలియజేసేందుకు యునైటెడ్ కింగ్‌డమ్ పర్యటనలో ఆయన ఉన్నారు. ఈ క్రమంలో.. ఉత్తర ఐర్లాండ్‌ను సందర్శించిన చార్లెస్.. ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. అయితే.. బెల్‌ఫాస్ట్ సమీపంలోని హిల్స్‌బరో క్యాజిల్‌(కోట)కు చేరుకున్న ఆయన.. సందర్శకుల పుస్తకంపై సంతకం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఛార్లెస్ తన చేతిలోని పెన్ను లీక్ కావడంతో నిరాశతో చెందారు. ‘‘ఓహ్ గాడ్ ఐ హేట్ దిస్ (పెన్)!’’ అంటూ చార్లెస్ లేచి నిలబడి చేతిని తుడుచుకుంటూ ఆ పెన్నును తన భార్య, క్వీన్ కన్సార్ట్ కెమిల్లాకు అందజేశాడు. ఆపై ఆ ఫ్రస్ట్రేషన్‌లో తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడాయన.

ఇదిలా ఉంటే.. చార్లెస్‌ రాజుగా ప్రమాణం చేయడానికి ముందు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఛార్లెస్‌ చాలా సరదాగా ఉంటారు. కానీ, ఆయనకు షార్ట్‌టెంపర్‌. అదీ ఇదీ కావాలని అడుగుతుంటారు కూడా’’ అని వెల్లడించారు.


నాలుగేళ్ల వయసులో ఛార్లెస్‌

ఇదిలా ఉంటే.. శనివారం లండన్‌లో పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు, టేబుల్‌పై ఉన్న పెన్ హోల్డర్ అడ్డుతగలడంతో విసుగు చెందిన చార్లెస్.. సహాయకులకు సహాయం చేయమని సైగ చేయడం, తన అసహనాన్ని ప్రదర్శించడం తెలిసే ఉంటుంది. స్వతహాగానే ఆయన ప్రవర్తన అలా ఉంటుందని కొందరు అంటుంటే.. 73 ఏళ్ల ఛార్లెస్‌ వయసురిత్యా అలా ప్రవర్తించి ఉంటారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. క్వీన్ ఎలిజబెత్ శవపేటిక బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు చేరుకుంది.

video courtesy: Daily Mail

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top