Viral Video: ‘వాట్‌ ఏ టైమింగ్‌.. ఇక్కడ విసిరితే అక్కడ ల్యాండ్‌ అయ్యింది’ | Street Vendor Tosses Food From Wok To Man In Viral Video | Sakshi
Sakshi News home page

Viral Video: అసలు ఇది నిజమేనా? ‘వాట్‌ ఏ టైమింగ్‌.. ఆ ల్యాండింగ్‌ చూసావా గురూ! పర్‌ఫెక్ట్‌’

Nov 22 2021 11:41 AM | Updated on Nov 22 2021 4:37 PM

Street Vendor Tosses Food From Wok To Man In Viral Video - Sakshi

ఓ స్ట్రీట్‌ వెండర్‌ తన బాణీలో కుక్‌ చేసిన గ్రీన్‌ బీన్స్‌ను అలా స్టైల్‌గా ఆడిస్తూ ఒక్కసారిగా పైకి గాల్లోకి విసిరేశాడు. అవి నేరుగా పక్కన విధి వద్ద నిల్చున్న వ్యక్తి ప్లేట్‌లో పడ్డాయి.

స్ట్రీట్‌ ఫుడ్‌ అంటే అందరికీ ఇష్టమే.. పానీపూరి, సమోసా, ఫాస్ట్‌ఫుడ్‌, బ్రెడ్‌ ఆమ్లెట్‌ ఇలా ఫుడ్‌ ఏదైనా అన్నీంటిని ఆవురావురని లాగించేస్తుంటాం. ఇవి ఆర్యోగ్యానికి అంతగా హెల్దీ కావని తెలిసిన వారానికి ఒకసారైన నాలుకకు వీటి రుచి తాగాలాల్సిందే.  స్ట్రీట్‌ వెండర్స్‌కు ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్‌ ఉంటుంది. కొంతమంది ఆ ఫుడ్‌ను ఇష్టపడి అక్కడికి వెళ్లి తింటే మరికొంత వాళ్లు స్టైల్‌గా చేసే కుకింగ్‌ విధానానికే ఫిదా అయిపోయి వెళ్తుంటారు. చేతులతో గరిటెలను, గిన్నేలను అటు ఇటు తిప్పుతూ రఫ్ఫాడిస్తుంటారు. 
చదవండి: ఇది కదా ఫిట్నెస్‌: ఈ ముగ్గురు భామలకు ఫిదా అవ్వాల్సిందే

తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ స్ట్రీట్‌ వెండర్‌ తన బాణీలో కుక్‌ చేసిన గ్రీన్‌ బీన్స్‌ను అలా స్టైల్‌గా ఆడిస్తూ ఒక్కసారిగా పైకి గాల్లోకి విసిరేశాడు. అవి నేరుగా రోడ్డు పక్క వీధి వద్ద నిల్చున్న వ్యక్తి ప్లేట్‌లో పడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 22 మిలియన్ల వ్యూవ్స్‌ సంపాదించింది.
చదవండి: ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడిన యాచకురాలు.. ఆమె గతం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే 

అయితే దీనిని చూసిన నెటిజన్లు అసలు ఇది నిజమేనా? అని ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొంతమంది ఆ వ్యక్తి నైపుణ్యాలను మెచ్చకుంటున్నారు. ‘వావ్‌.. వాట్‌ ఏ స్టైల్‌.. టైమింగ్‌ అదిరింది గురూ. ఇక్కడ విసిరితే అక్కడ సరిగ్గా ల్యాండ్‌ అయింది చూడు. అది గ్రేట్‌’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement