వేలానికి మాజీ పోర్న్‌ స్టార్‌ కళ్లజోడు

Mia Khalifa To Auction Her Favourite Black Glasses To Help Beirut - Sakshi

వాషింగ్టన్‌‌: బీరుట్‌ పేలుడు ఘటనలో బాధితులకు సాయం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, ప్రముఖులు ముందుకొస్తున్నారు. మాజీ పోర్న్ స్టార్, క్రీడా వ్యాఖ్యాత మియా ఖలీఫా కూడా తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. బీరుట్‌ బాధితులకు సాయం చేసేందుకు తన ఫేవరెట్ కళ్లద్దాలను ఆమె ‘ఈబే’ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో వేలానికి పెట్టారు. ఈ  విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. వేలం ద్వారా వచ్చిన డబ్బును... పేలుడు బాధితుల సహాయార్థం లెబనాన్‌ రెడ్‌ క్రాస్‌ సంస్థకు ఇస్తానని చెప్పారు.
(బీరుట్‌ ప్రమాదం: నెల కిత్రమే హెచ్చరించినా)

వేలానికి పెట్టిన మొదటి 11 గంటల్లోనే తన కళ్లజోడుకు రూ.75 లక్షల దాకా పలికినట్లు తెలిపారు. ఇప్పటివరకు 189 మంది బిడ్డింగ్‌ వేశారని పేర్కొన్నారు. మరింతమంది బిడ్డింగ్‌లో పాల్గొని ఎక్కువ మొత్తం అందించాలని ఆమె కోరారు. మీరిచ్చే ప్రతిపైసా బీరుట్‌ పచ్చదనానికి ఉపయోగపడుందని ఆమె వ్యాఖ్యానించారు. కాగా, మియా ఖలీఫా పుట్టింది లెబనాన్‌లోనే. 2001లో ఆమె అమెరికా వెళ్లిపోయారు. ఇక బీరుట్‌ పేలుడు ఘటనలో 178 మంది చనిపోగా... 6000 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే.
(నా గత జీవితం దారుణమైంది : పోర్న్‌ స్టార్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top