వీడు మామూలోడు కాదు.. అంబులెన్స్‌ను ఫ్రీ ట్యాక్సీలా వాడేశాడు!

Man Warned Over He Called Ambulance 39 Times year Use Free Taxi In Taiwan - Sakshi

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, హఠాత్తుగా ఎవరైనా అస్వస్థతకు గురైనప్పుడు వెంటనే అంబులెన్స్‌కు కాల్‌ చేస్తాం. అయితే చాలా వరకు మెడికల్‌ ఎమర్జెన్సీకి మాత్రమే అంబులెన్స్‌ సేవలను ఉపయోగించుకుంటాం. అయితే ఓ వ్యక్తి ఏడాదిలో సుమారు 39 సార్లు స్థానికంగా ఉన్న ఆస్పత్రి అంబులెన్స్‌ను ఫోన్‌ చేసి.. సేవలను వినియోగించుకున్నాడు. అయితే ఏడాదికి 39 సార్లు ఎందుకని ఆలోచిస్తున్నారా? ఆ వ్యక్తి చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోతారు. తైవాన్‌కు చెందని ఓ యువకుడు సూపర్‌ మార్కెట్‌లకు వెళ్లిన ‍ప్రతిసారి తిరుగు ప్రయాణంలో అంబులెస్స్‌కు ఫోన్‌ చేశాడు. అలా చాలా సార్లు మెడికల్‌ ఎమెర్జెన్సీ అని కాల్‌ చేయడంతో అంబులెన్స్‌ సిబ్బంది  స్థానిక ఆస్పత్రిలో చేర్చారు.

చదవండి: సిగరెట్‌ కాల్చే అలవాటే ఆమె ప్రాణాల్ని కాపాడింది

అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి ఆస్పత్రిలో చేరినవారు చికిత్స తీసుకుంటారు. కానీ, ఆస్పత్రిలో చేరిన తర్వాత ఆ వ్యక్తి అక్కడ కనిపించకుండా వెళ్లిపోవడాన్ని ఆస్పత్రి సిబ్బంది గమనించారు. మరోసారి ఇలా జరిగినప్పుడు అతన్ని ఆస్పత్రి సిబ్బంది పట్టుకొని ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతను ఆస్పత్రి అంబులెన్స్‌కు పదేపదే కాల్‌ చేయడానికి కారణం ఏంటని అడగ్గా.. సూపర్‌ మార్కెట్‌ నుంచి తన ఇంటికి వెళ్లడానికి అంబులెన్స్‌ను టాక్సీలా వాడుకుంటున్నాని తెలపడంతో ఆశ్చర్యపోవటం ఆస్పత్రి సిబ్బంది వంతైంది.

చదవండి: డిసెంబర్‌ 12న మిస్‌ యూనివర్స్‌ పోటీలను నిర్వహిస్తాం..! రద్దు చేయలేం..: విదేశాంగ మంత్రి

అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆస్పత్రి డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోసారి అంబులెన్స్‌ సేవలను దుర్వినియోగపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, భారీ జరిమానా కూడా విధిస్తామని పోలీసులు సదరు యువకుడిని హెచ్చరించారు. అయితే అతని ఇల్లు పక్కనే ఆస్పత్రి ఉండటంతోపాటు, సూపర్‌ మార్కెట్‌ కూడా కేవలం 200 మీటర్లు దూరంలో ఉండటంపై సోషల్‌ మీడియాలో ఆ యువకుడి చేసిన పనికి నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top